సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే కాగా..సోషల్ మీడియాలో నిన్నటిదాకా ఒక కాంట్రవర్శీ రన్ అయ్యింది. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ కు ఎస్ఎస్ఆర్ఎంబీ అని కొందరు హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. మహేశ్ ఫ్యాన్స్ మాత్రం ఎస్ఎస్ఎంబీ 29ను వైరల్ చేశారు.
దీంతో ఈ రెండు వర్గాల మధ్య ట్వీట్ల పోరు సాగింది. ఈ కాంట్రవర్శీకి చెక్ పెట్టారు రాజమౌళి. ఆయన రాసిన ఓ థ్యాంక్స్ లెటర్ లో తమ సినిమా పేరును ఎస్ఎస్ఎంబీ 29గా పేర్కొన్నాడు. దీంతో మహేశ్, రాజమౌళి కాంబో మూవీ వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబీ 29గా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఒడిశ్సాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కంప్లీట్ చేశారు. అక్కడ ఫ్యాన్స్ తో మహేశ్ తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.