నాని సినిమాకు వర్షం అడ్డంకి

నాని(Nani) కొత్త సినిమా సరిపోదా శనివారం(Saripoda sanivaram)కు వరణుడు అడ్డుగా నిలుస్తున్నాడు. ఈ సినిమా వసూళ్లు వర్షాల కారణంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో థియేటర్స్ కు పెద్దగా ప్రేక్షకులు వెళ్లడం లేదు. దీంతో సరిపోదా శనివారం సినిమాపై ఆ ఎఫెక్ట్ క్లియర్ గా పడింది. సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్ కు తోడు ఈ ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెడుతోంది.

గ్రాండ్ గా ఈ సినిమాకు ప్రమోషన్ చేసి రిలీజ్ చేసింది డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. అనుకున్న తేదీకే విడుదలకు తీసుకొచ్చారు. అయితే ఈ అనూహ్య వర్షాలను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ అంతరాయాలు ఎర్పడుతున్నాయి. దీంతో ఆదివారం వీకెండ్ అయినా థియేటర్స్ కు జనం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందించారు.