బ్లాక్ బస్టర్ ఇయర్ 2024కు బైబై చెబుతున్న రశ్మిక

తన కెరీర్ లో మరో సెన్సేషనల్ ఇయర్ ను కంప్లీట్ చేసుకుంది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. రీసెంట్ గా ఆమె పుష్ప 2 సినిమా నేషనల్ వైడ్ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది రశ్మిక. ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో 2024కు బైబై చెబుతోంది రశ్మిక. ఈ ఏడాది చేస్తున్న మరో రెండు క్రేజీ మూవీస్ ది గర్ల్ ఫ్రెండ్, సికిందర్ తో నెక్స్ట్ ఇయర్ కూడా తనదే అనేంత కాన్ఫిడెన్స్ తో ఉంది రశ్మిక.

ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తోంది రశ్మిక. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక బాలీవుడ్ లో రశ్మిక చేస్తున్న మరో భారీ చిత్రం సికిందర్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన రశ్మిక ఈ సినిమాలో నటిస్తోంది. ఇది కూడా రశ్మికకు నెక్ట్స్ ఇయర్ బిగ్ టికెట్ మూవీ కానుంది. 2024ను సంతోషంగా కంప్లీట్ చేసి 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది రశ్మిక.