మోహన్ బాబు అరెస్ట్ పై స్పందించిన పోలీస్ కమీషనర్

జర్నలిస్టుపై దాడి, కుటుంబ గొడవల నేపథ్యంలో మంచు కుటుంబ సభ్యులపై ఇప్పటిదాకా 3 కేసులు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. మోహన్ బాబు అరెస్ట్ పై ఆలస్యమేమీ చేయడం లేదని, చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామని, దానికి ఆయన ఈ నెల 24 తేదీ వరకు సమయం అడిగారని సీపీ సుధీర్ బాబు చెప్పారు. కోర్టు కూడా మోహన్ బాబుకు కొంత సమయం ఇచ్చినందుకు ఆ గడువు ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తామని అన్నారు. మోహన్ బాబు దగ్గర ఉన్న రెండు గన్స్ తీసుకున్నామని సీపీ తెలిపారు. గాయపడిన వ్యక్తిని సానుభూతితో మోహన్ బాబు కలిసి ఉంటాడని సీపీ చెప్పారు.