“పుష్ప 2” టీమ్ కు లీకుల బెడద

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక్కడ సినిమాలోని కీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ టార్గెట్ పెట్టుకోవడంతో ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా షూటింగ్ చేస్తూ వెళ్తున్నారు. షూటింగ్ టైమ్ లో ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోస్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయినా లీక్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా అల్లు అర్జున్ కొత్త గెటప్ లో ఉన్న ఫొటో ఒకటి లీక్ అయి సోషల్ మీడియాలో తిరుగుతోంది. రిలీజ్ వాయిదా రూమర్స్ ను కొట్టిపారేసేందుకు మూవీ టీమ్ 200 రోజుల కౌంట్ డౌన్ ప్రకటించింది. మరో 200 రోజుల్లో సినిమాను తెరపైకి తీసుకొస్తామంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. పుష్ప 2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.