పుష్ప రాజ్ మూడో వారంలో కూడా తగ్గడం లేదు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. అయితే.. బాలీవుడ్ లో ఈ వారం కొత్త సినిమాలు వచ్చాయి. దీంతో పుష్ప రాజ్ స్పీడుకు బ్రేక్ పడుతుంది అనుకున్నారు కానీ.. అదే స్పీడుతో వెళుతున్నాడు. పుష్ప 2 వేగంగా ఈ చిత్రం 1700 కోట్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి టోటల్ గా 1705 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. బాహుబలి 2 ఆల్ టైం కలెక్షన్స్ కి 100 కోట్ల దూరంలో ఈ చిత్రం ఉంది.
క్రిస్మస్ కు బేబీ జాన్ మూవీ వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఇది తెరి సినిమాకు రీమేక్. ఈ సినిమా పుష్ప రాజ్ స్పీడుకు బ్రేక్ వేస్తుందని అనుకున్నారు కానీ.. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే.. మూడోవారంలో పుష్ప రాజ్ సాధించిన కలెక్షన్స్ లో సగం బేబీ జాన్ కలెక్ట్ చేసింది. అంటే.. అక్కడ పుష్ప రాజ్ కు ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. న్యూయర్ కి మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.