టెన్షన్ లో పుష్ప 2 మేకర్స్..?

పుష్ప 2.. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ కలయిలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమా నుంచి 36 సెకన్ల వీడియో లీకైంది. మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ లీకర్స్ ఎక్కడ కెమెరా పెట్టారో కానీ.. వీడియోను లీక్ చేశారు. ఇది తెలిసి పుష్ప 2 మేకర్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. గతంలో కూడా చాలా సినిమాలు లీకైన సందర్భాలు ఉన్నాయి.

అత్తారింటికి దారేది సినిమా అయితే… అర గంట సినిమానే లీక్ చేసేశారు. ఇప్పుడు వీడియో లీక్ కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ మరింతగా కేర్ తీసుకుంటున్నారట. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. చాలా తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టింది. అంచనాలకు మించి ఉండేలా సుకుమార్ కథ పై చాలా కసరత్తు చేశారు. ఈ క్రేజీ మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. మరి.. పుష్ప 2 ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో అనేది ఆసక్తిగా మారింది.