“పుష్ప 2” 50 డేస్ కంప్లీట్, ఓటీటీ రిలీజ్ అప్పుడేనా ?

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా హిస్టారిక్ సక్సెస్ సాధిస్తోంది. ఈ సినిమా నేటితో 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. డిసెంబర్ 5న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని 32 రోజుల్లోనే 1831 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ దంగల్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో నిలిచింది. పుష్ప 2 50 డేస్ కంప్లీట్ అయిన సందర్భంగా మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. నార్త్ లో ఇప్పటికీ పుష్ప 2 సినిమా ప్రదర్శితమవుతోంది. ఓవరాల్ గా థియేట్రికల్ రన్ ముగుస్తున్న నేపథ్యంలో పుష్ప 2 ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. జనవరి 31న లేదా ఫిబ్రవరి 1న పుష్ప 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోందని టాక్ వినిపిస్తోంది.