100 రోజుల్లో “పుష్ప 2”, రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

అల్లు అర్జున్(Allu arjun) హీరోగా దర్శకుడు సుకుమార్(Sukumar) రూపొందిస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ బిగిన్ అయ్యింది. ఈ సినిమా మరో వంద రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. డిసెంబర్ 6న పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కొత్త పోస్టర్ తో సోషల్ మీడియాలో 100 డేస్ టు గో అంటూ పోస్ట్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers).

డిసెంబర్ 6న పుష్ప2 రావడం లేదని, ఇది వచ్చే సమ్మర్ కు వాయిదా పడుతుందనే రూమర్స్ నేపథ్యంలో మూవీ ప్రొడక్షన్ హౌస్ మాత్రం పదే పదే డిసెంబర్ 6న రిలీజ్ పక్కా అంటూ సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా తెలియజేస్తోంది. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అయితే ఈ ఇయర్ టాలీవుడ్ నుంచి థియేటర్స్ లోకి వస్తున్న మరో బిగ్ మూవీ కానుంది.