ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను ప్రాజెక్ట్ కే బ్రేక్ చేయడం ఖాయం – రానా దగ్గుబాటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తుంది. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు.. ఆసక్తిని రేకెత్తించాయి.

ఇప్పుడు రానా దగ్గుబాటి.. ప్రాజెక్ట్- కే గురించి చేసిన కామెంట్స్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయని చెప్పచ్చు. ఇంతకీ ఏం చెప్పాడంటే.. ప్రభాస్‌ నటిస్తున్న ప్రాజెక్ట్‌- కే చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది అన్నారు. అంతే కాకుండా.. ఇప్పటి వరకు ఉన్న బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులను ప్రాజెక్ట్- కే బ్రేక్‌ చేస్తుందని చెప్పారు.
రానా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Rana on Project K
by u/areyareyareyarey in tollywood