పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్. సుప్రసిద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ నటిస్తుండడం విశేషం. ఈ సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ ను యుఎస్ లో 20న ఇండియాలో 21న రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. మేకర్స్ ఈ మూవీ పోస్టర్ లో రెండు వేరు వేరు చేతులు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టినట్టు చూపించారు. అయితే.. ఈ రెండు కూడా ప్రభాసే కావచ్చు అని ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు మొదలైంది. ఈ చిత్రంలో భూత, భవిష్యత్ కాలాల నుంచి కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి రెండు కాలమానాలు నుంచి వచ్చిన ఈ ఇద్దరు ప్రభాస్ లే కావచ్చని ఓ టాక్ వినిపిస్తోంది. దీంతో మరింత ఆసక్తి ఏర్పడింది. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. సమ్మర్ లో వస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి.. రిలీజ్ డేట్ పై ఈ నెల 21న క్లారిటీ ఇవ్వనున్నారు.
The world awaits the ultimate showdown.
Brace yourselves for a glimpse into the world of #ProjectK on July 20 (USA) & July 21 (INDIA).Stay tuned and Subscribe: https://t.co/AEDNZ3ni5Q#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms… pic.twitter.com/MMc60mrHxH
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 14, 2023