ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన హరికథ వెబ్ సిరీస్ రీసెంట్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మూవీ లవర్స్ తో పాటు మీడియా నుంచి ఈ సిరీస్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తన టీమ్ కు గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చారు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఈ పార్టీలో దివి, రుచిర సాదినేని, శ్రీమతి విక్రమ్, తేజ కాకమాను, భాను ప్రకాష్, నవీన్ రాజ్, ఉషా శ్రీ మరియు క్రూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శశి కిరణ్ నారాయణ పాల్గొన్నారు.
రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హరికథ’ వెబ్ సిరీస్ కు ‘మ్యాగీ’ దర్శకత్వం వహించారు. ఈ నెల 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ వ్యాల్యూ పెంచేలా ఈ హరికథ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది.