ఎస్ కేఎన్ మనస్ఫూర్తిగా మాట్లాడాడు – బ్రహ్మానందం

సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్ కేఎన్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంపై ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం మరికొన్ని తరాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని తన కామెడీతో నవ్వించాలని కోరారు ఎస్ కేఎన్. బ్రహ్మానందం కామెడీ చూస్తే మన జీవితాల్లో ఒత్తిడి పోతుందని, ఆయన కామెడీ వీడియో క్లిప్ చూడని రోజు ఉండదని ఎస్ కేఎన్ అన్నారు. బ్రహ్మానందంపై ఎస్ కేఎన్ ఇచ్చిన స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎస్ కేఎన్ స్పీచ్ పై వేదిక మీద ఉన్న బ్రహ్మానందం స్పందించాడు. మనస్ఫూర్తిగా తన గురించి ఎస్ కేఎన్ మాట్లాడాడని, ఆయన గుండెల్లోంచి ఆ మాటలు వచ్చాయని బ్రహ్మానందం అన్నారు. ఇలాంటి వారి అభిమానం ఉండగా..తనకు తిరుగులేదని బ్రహ్మానందం చెప్పారు.