ఎన్టీఆర్ అభిమానికి అండగా నిలబడిన ఎస్ కేఎన్

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని ఒకరికి అండగా నిలబడ్డారు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ రిక్వెస్ట్ పంపారు. తమలో ఒకరైన అభిమాని రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఆయనది పేద కుటుంబమని, ఆస్పత్రి ఖర్చులకు సాయం చేయాలంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో ఎన్టీఆర్ అభిమానులు తమకు తోచినంత విరాళాలు సేకరిస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఎస్ కేఎన్ కూడా స్పందించారు.

50 వేల రూపాయలు తాను సహాయంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ కేఎన్ చేసిన ఈ సహాయంతో ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ఇటీవల దర్శకుల సంఘం ఎన్నికల్లో తన స్నేహితులు సాయి రాజేశ్, వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంలోనూ స్పందించిన ఎస్ కేఎన్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఇన్సూరెన్స్ కోసం 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చారు. ఇప్పుడు బేబి హిందీ రీమేక్ తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎస్ కేఎన్.