‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకుంది కొణిదెల నిహారిక. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంలో ఆమె మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ రెడీ చేసుకుంటోంది. నిహారిక ఈ రోజు తన పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై కొత్త సినిమా ప్రకటించింది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటించనున్నారు.
తమ సంస్థలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్న మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. గతంలో పలు వెబ్ సిరీస్ లకు డైరెక్షన్ చేసింది మానస శర్మ. నిహారిక నిర్మించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ లో నటించారు సంగీత్ శోభన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రమిదే కానుంది.