సితార సంస్థలో సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన నిర్మించిన మ్యాడ్ 2 రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సితార సంస్థ ఎన్టీఆర్ తో సినిమా చేయనుందనే వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాల్సి ఉంది. 2026లో ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.
మ్యాడ్ 2 ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన నాగవంశీకి ఎన్టీఆర్, నెల్సన్ మూవీ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా నెల్సన్ తో సినిమా చేయడం ఫిక్స్. కాకపోతే హీరో ఎవరు అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదన్నారు. అసలు ఎన్టీఆర్ తో నాగవంశీ సినిమా అని ముందుగా వార్తలు వచ్చి.. ఆతర్వాత నెల్సన్ ని ఫైనల్ చేశారని వినిపించింది కానీ.. ఇప్పుడు నెల్సన్ తో ఫిక్స్ కానీ.. హీరో ఫైనల్ కాలేదని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాగవంశీ. దీంతో అసలు ఏం జరిగింది అనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా షూట్ లో ఎన్టీఆర్ ఏప్రిల్ లో జాయిన్ కానున్నాడు.