పవన్ తో సినిమా – నాగవంశీ ప్రాక్టికల్ ఆన్సర్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార సంస్థ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్స్ లో నాగవంశీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఈ సంస్థ 50వ సినిమాను ఏ హీరోతో చేస్తారు అనే టాపిక్ బయటకు వచ్చింది. దీనికి కారణం ఏంటంటే.. పవన్ కళ్యాణ్‌, ఎన్టీఆర్..ఈ ఇద్దరిలో ఒకరితో మాత్రమే 50వ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని సంగీత్ శోభన్ నాగవంశీని అడిగాడు. దీనికి నాగవంశీ ఏమని ఆన్సర్ ఇచ్చారంటే..పవన్ కళ్యాణ్‌ గారు ఉన్న స్థాయికి రాష్ట్రానికి ఏం చేస్తారు..? ఇంకా పెద్ద పొజిషన్లకు ఎప్పుడు వెళ్తారు అని కోరుకోవాలి కానీ.. సినిమా తీయాలని కాదు అన్నారు.

అలా సితార సంస్థ 50వ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తాననే విషయాన్ని నాగవంశీ చెప్పకనే చెప్పేశారు. నాగవంశీ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్పారు. కారణం ఏంటంటే.. పవన్ కళ్యాణ్‌ బాలన్స్ ఉన్న మూడు సినిమాలను పూర్తి చేయడానికే టైమ్ కుదరడం లేదు. వాటికి టైమ్ ఇవ్వడమే కష్టం అవుతుంది. అలాంటిది కొత్త సినిమా అంటే అయ్యే పని కాదు. పైగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు.. డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. మొత్తానికి అయితే.. ఇప్పటి నుంచే 50 సినిమా గురించి ప్లానింగ్ లో ఉన్నారు నాగవంశీ.