విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వీడీ 12 గురించి నిర్మాత నాగవంశీ సర్ ప్రైజింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్ ను మార్చలేదని, శ్రీలీలనే హీరోయిన్ గా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. రశ్మికను తాము అప్రోచ్ కూడా కాలేదని ఆయన అన్నారు. ఈ నవంబర్ నుంచి వీడీ 12 సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని నాగవంశీ అన్నారు.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని, ఈ కథకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని నాగవంశీ చెప్పారు. విజయ్ సినిమా హిట్ కొడితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో తమకు తెలుసున్నారు. వీడీ 12కు మంచి క్రూ సెట్ అయ్యిందని..సినిమా మీద కాన్ఫిడెన్స్ తో ఉన్నామని నాగవంశీ అన్నారు.
గుంటూరు కారం సినిమా టాకీ మొత్తం ఈ నెల 20 కల్లా పూర్తవుతుందని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నాగవంశీ చెప్పారు. అలాగే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియా మూవీగా చేస్తున్నామన్నారు. ఈ సినిమాలో ఒక కొత్త కథను త్రివిక్రమ్ తైరపైకి తెస్తున్నారని నాగవంశీ చెప్పారు.