నా సినిమాలను బ్యాన్ చేయండి, చూసుకుందాం – ప్రొడ్యూసర్ నాగవంశీ

కొన్ని వెబ్ సైట్స్ రాస్తున్న నెగిటివ్ వార్తలు, సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాత నాగవంశీ. ఆయన నిర్మించిన మ్యాడ్ 2 సినిమాకు ఫేక్ కలెక్షన్స్ చెబుతున్నారని, సినిమా బాగా లేకున్నా కలెక్షన్స్ ఎలా వస్తున్నాయని రాస్తున్న వెబ్ సైట్స్ పై నాగవంశీ ఫైర్ అయ్యారు. సినిమా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారని, సినిమా బాగా లేకున్నా ఆడటానికి మ్యాడ్ 2 స్టార్ హీరోస్ ఉన్న సినిమా కాదని అన్నారు.

నాగవంశీ మాట్లాడుతూ – మ్యాడ్ 2 సినిమా రిలీజైన రోజు నెగిటివ్ రివ్యూస్ రాశారు. స్వాతి రెడ్డి పాట బాగాలేదని రాశారు, సెకండాఫ్ లో కంటెంట్ లేదన్నారు. మీ పని మీరు చేశారని అనుకున్నా. ఈ రోజు కలెక్షన్స్ బాగున్నా నెగిటివ్ వార్తలు రాస్తున్నారు. సినిమా బాగా లేకుంటే ఎవరూ చూడరు. పక్క సినిమా(రాబిన్ హుడ్) బాగా లేదు ఆడటం లేదు, కోర్ట్ సినిమా బాగుంది చూస్తున్నారు. కలెక్షన్స్ బాగున్నా మీరు మా మూవీని ఎంకరేజ్ చేయకపోవడం బాధాకరం. సినిమాను చంపకండి, మేము సినిమాలు నిర్మిస్తేనే మీడియా పనిచేస్తుంది. నా మీద అంత పగ ఉంటే నా సినిమాలను బ్యాన్ చేయండి, నా మూవీస్ మీద ఏమీ రాయకండి, చూసుకుందాం. అన్నారు.