తమ సంస్థ కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. నిన్నటి నుంచి టాలీవుడ్ లోని పలు నిర్మాణ సంస్థలపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
ఈ రోజు తన ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన దిల్ రాజు మీడియా ముందు స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడి మీదే కాదని, మొత్తం ఇండస్ట్రీ మీద జరుగుతున్నాయని అన్నారు. సినిమా వసూళ్లు, చెల్లించే పన్ను మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా ఐటీ అధికారులు గుర్తించారు.