త్రివిక్రమ్ కు సారీ చెప్పిన బండ్ల గణేష్

దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) కు సారీ చెప్పారు నిర్మాత బండ్ల గణేష్(Bandla ganesh). ఈ రోజు గబ్బర్ సింగ్(Gabbarsingh) రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా మళ్లీ రిలీజ్ అవుతోంది. ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ – ఆ మధ్య ఓ అభిమాని ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆవేశంలో త్రివిక్రమ్ గురించి తప్పుగా మాట్లాడాను. ఆ తర్వాత అలా మాట్లాడి ఉండకూడదని అనిపించింది. త్రివిక్రమ్ కు ఫోన్ చేసి సారీ చెప్పాను. ఆ సందర్భం తర్వాత మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నాం. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు పవన్ కల్యాణ్ తో మాట్లాడి గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ నాకు వచ్చేలా చేసిందే త్రివిక్రమ్. తీన్ మార్ సినిమాను మళ్లీ రిలీజ్ చేసి హిట్ అయ్యేలా చేస్తాను. పవన్ కల్యాణ్ ను నేనెప్పుడూ విమర్శించలేదు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా అభిమానిస్తూనే ఉంటా. అన్నారు

ఆ మధ్య త్రివిక్రమ్ ను తిడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలోకి వచ్చి సెన్సేషన్ అయ్యింది. పవన్ దగ్గరకు త్రివిక్రమ్ ఎవర్నీ వెళ్లనీయడం లేదని, ఈవెంట్స్ కు రాకుండా చేస్తున్నాడని, పవన్ ను గ్రిప్ లో పెట్టుకున్నాడంటూ బండ్ల గణేష్ ఆ ఫోన్ కాల్ లో పవన్ అభిమానితో మాట్లాడారు. బండ్ల గణేష్ ఫోన్ ఆడియో లీక్ అవడం త్రివిక్రమ్, బండ్ల గణేష్ మధ్య దూరాన్ని పెంచింది.