“తండేల్” బాక్సాఫీస్ రివ్యూ చెప్పిన అల్లు అరవింద్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. క్రిస్మస్ కు రావాల్సిన ఈ సినిమాని సంక్రాంతికి అయినా రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు కానీ.. ఫిబ్రవరి 7న తండేల్ భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ హైలెస్సా.. హైలెస్సో అంటూ సాగే లవ్ మెలోడీని రిలీజ్ చేశారు.

రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్ తో ఉన్న ఈ పాట విన్న వెంటనే నచ్చేలా ఉండడంతో యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ సాంగ్ ను శిల్పకళావేదికలో చేసిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నాగచైతన్య కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని.. టీమ్ అంతా కష్టపడ్డారని.. ఆ కష్టానికి తగ్గ ఫలితం రావడం ఖాయం అన్నారు. ఈ మూవీకి ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మరింత క్రేజ్ పెరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ రావడం ఖాయమని.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మెప్పిస్తుందని నమ్మకంగా ఉన్నారు. మరి.. ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.