బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో ప్రియాంక జవాల్కర్

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka jawalkar) అందానికి తగిన గుర్తింపు రాలేదు. తెలుగు అమ్మాయి కాబట్టే ఈ నాయికను చిన్న చూపు చూశారేమో. అనంతపురానికి చెందిన ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా (Taxiwala), ఎస్ఆర్ కల్యాణమండపం (SR kalyanamandapam) సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకు టైమ్ కలిసి రాలేదు. సినిమాలు తగ్గుతూ వచ్చాయి.

రీసెంట్ గా టిల్లు స్క్వేర్ (Tillu square) లో మెరిసింది ప్రియాంక. ఓ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ క్యారెక్టర్ కు వచ్చిన క్రేజ్ తో టిల్లు క్యూబ్ లో ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారట. టిల్లు కథలో హీరోయిన్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ప్రియాంకలో ఉన్నాయి. యంగ్ అండ్ బ్యూటిఫుల్, నెగిటివ్ షేడ్స్ ప్రియాంక అప్పీయరెన్స్ లో కనిపిస్తాయి. టిల్లు క్యూబ్ (Tillu 3) కు కొంత టైమ్ పట్టినా ఇది ప్రియాంకకు క్రేజీ ఆఫర్ అనుకోవచ్చు.