మహేష్ మూవీలో ప్రియాంక చోప్రా

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రియాంక చోప్రా సూప‌ర్ స్టార్ మహేష్ బాబు మూవీలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. మ‌హేష్ బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఆ మేర‌కు ఫిలింఫేర్ త‌న క‌థ‌నంలో ఈ వివ‌రాల్ని వెల్ల‌డించింది. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే మ‌హేష్ త‌న మేకోవ‌ర్ తో సిద్ధంగా ఉన్నాడు. రాజ‌మౌళి ఈ చిత్రాన్ని ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ కేట‌గిరీలో అత్యంత భారీగా తెర‌కెక్కిస్తున్నారు.

దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. ప్రియాంక చోప్రా చివ‌రిగా స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో న‌టించింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌హేష్ – రాజ‌మౌళి లాంటి క్రేజీ కాంబినేష‌న్ లో అవ‌కాశం అందుకోవ‌డం జాక్ పాట్ అనే చెప్పాలి. అయితే.. ఇందులో మహేష్ కు జంటగా నటిస్తుందా..? లేక కీలక పాత్ర పోషిస్తుందా..? అనేది ఆసక్తిగా మారింది. బాలీవుడ్ లో మాత్రం ఈ వార్త నిజమే అని గట్టిగా వినిపిస్తోంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. కాబట్టి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.