ఎస్ఎస్ఎంబీ 29 – మళ్లీ హింట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి..వీరిద్దరి కాంబోలో భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉన్న ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డా.కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులే కాకుండా.. హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తుండడం విశేషం. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా నటిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఇటీవల దుబాయ్ నుంచి హైదరాబాద్ కు ప్రియాంకా చోప్రా వచ్చింది. రాజమౌళితో ఈ సినిమా విషయమై మాట్లాడేందుకుకే వచ్చిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్త చాఫ్టర్ మొదలైందని.. హైదరాబాద్ లో చిలుకూరి బాలాజీని దర్శకున్న తర్వాత ప్రియాంకా చోప్రా ఈ పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా.. హైదరాబాద్లో తనకు ఎంతగానో సహాయ సహకారాలు అందించిన ఉపాసనకు స్పెషల్ ధ్యాంక్స్ చెప్పింది. దీనికి ఉపాసన స్పందిస్తూ.. నీ కొత్త సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో మహేష్, రాజమౌళి మూవీలో ప్రియంకా చోప్రా నటిస్తుందనేది మరోసారి క్లారిటీ వచ్చింది. ఇక అఫిషియల్ గా అనౌన్స్ చేయడమే ఆలస్యం. మరి.. త్వరలో జక్కన్న పూర్తి వివరాలను ప్రకటిస్తాడేమో చూడాలి.