ప్రైమ్ వీడియో నుంచి నాగ్ సినిమా మాయం

నాగార్జున తన 99వ సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి నా సామి రంగ అనే టైటిల్ పెట్టుకున్నారు. టైటిల్ కు తగినట్లే నాగ్ బర్త్ డేకు రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా మాస్, యాక్షన్ తో ఉంది. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. నా సామి రంగ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ మెంట్ రోజే ప్రకటించారు.

ఇక ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నా సామి రంగ సినిమా మలయాళ హిట్ ఫిల్మ్ పొరింజు మరియమ్ జోసే తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఈ సినిమా ఒరిజినల్ నిన్నటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. అయితే ఉన్నట్లుండి ఈ సినిమాను ప్రైమ్ వీడియో తొలగించింది. ఇండియాతో పాటు యూఎస్ లోనూ ప్రైమ్ వీడియోలో పొరింజు మరియమ్ జోసే సినిమా కనిపించడం లేదు.

ఇది సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఒరిజినల్ మూవీ ఓటీటీలో ఉంటే నాగ్ సినిమాకు ఇబ్బంది అనుకుని అమోజాన్ ప్రైమ్ నుంచి తొలగించారా లేక ఆ సినిమా డిజిటల్ హక్కుల్లో ఏమైనా నిబంధనలు పెట్టుకున్నారా అనేది తెలియాల్సిఉంది. ఒరిజినల్ చూస్తే ప్రేక్షకులు తెలుగు సినిమాతో పోల్చుకునే అవకాశాల ఉండేవి. ఏది ఏమైనా ఈ మలయాళ రీమేక్ తో చాలా రోజుల తర్వాత నాగ్ ఒక అసలు సిసలు మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు.