ప్రైమ్ లోకి వచ్చేసిన కాజల్ “సత్యభామ”

షీ టీమ్స్ (She teams) ఏసీపీ సత్యభామగా (Acp satyabhama) కాజల్ అగర్వాల్ (kajal agarwal) థియేటర్స్ లో సందడి చేసింది. ఈ నెల 7న థియేటర్స్ లోకి వచ్చిన సత్యభామ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది. థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న సత్యభామ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియో (Amazon prime video)లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి కాబట్టి సత్యభామ కూడా టాప్ లో ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

ఈ సినిమాను ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించారు దర్శకుడు సుమన్ చిక్కాల. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క (Shasikiran tikka) స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర (Naveen chandra), ప్రకాష్ రాజ్ (prakash raj), నాగినీడు, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యభామలో కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. ఓ హత్య కేసును సత్యభామ ఛాలెంజింగ్ గా తీసుకుని బాధితురాలికి న్యాయం చేసిన విధానాన్ని మేకర్స్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చూపించారు.