రానాతో ప్రశాంత్ వర్మ మూవీ

ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకనే టాలీవుడ్ హీరోలే కాదు.. బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆమధ్య బాలీవుడ్ హీరో రణ్‌ వీర్ సింగ్ తో బ్రహ్మారాక్షస్ అనే సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ప్రశాంత్ వర్మకు, రణ్ వీర్ సింగ్ కు మధ్య క్రియేటీవ్ డిపరెన్స్ స్ రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ సినిమాతో పాటు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా చేసే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రానాతో ప్రశాంత్ వర్మ బ్రహ్మారాక్షస్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. రానా ఈమధ్య సరైన సినిమా చేయలేదు. తేజతో సినిమా ప్రకటించాడు కానీ.. ముందుకు వెళ్లలేదు. గుణశేఖర్ తో రానా మూవీ చేయాలి అనుకున్నాడు కానీ.. అది కూడా సెట్ కాలేదు. నిర్మాతగా మాత్రం రానా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మతో రానా సినిమా అనేది ఆసక్తిగా మారింది. బ్రహ్మారాక్షస కథకి రానా సెట్ అవుతాడని కాంటాక్ట్ చేశాడట ప్రశాంత్ వర్మ. రానా కూడా ఇంట్రెస్ట్ చూపించాడని టాక్.