ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక కావ్యం ఆదిపురుష్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను అన్ని సౌత్ భాషల్లో అమోజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, రెట్రోఫైల్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు.
జూన్ లో రిలీజైన ఈ సినిమా..అత్యున్నత సాంకేతిక విలువలు, గ్రాఫిక్స్, భారీ మేకింగ్ తో ఆకట్టుకుంది. రామాయణాన్ని ఈతరం ప్రేక్షకులకు మరింత చేరువ చేసేలా సినిమాను రూపొందించారు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ క్రేజ్ ఈ సినిమా ఓపెనింగ్స్ పై స్పష్టంగా కనిపించింది.
సాధారణంగా పౌరాణిక సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ప్రేక్షకులు ఈ సినిమా డే వన్ ఫస్ట్ షో చూసేందుకు ఉత్సాహంగా థియేటర్స్ కు వెళ్లారు. ఇప్పుడు ఓటీటీలోకి ఆదిపురుష్ మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశముంది.