“కన్నప్ప” టీజర్ 2 – చివరలో మెరిసిన ప్రభాస్

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న కన్నప్ప సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ 2 పేరుతో ఈ రోజు రిలీజ్ చేసిన ఈ వీడియోలో సినిమాలోని కాస్టింగ్ మొత్తం చూపించారు. ప్రతి నటుడికి ఒక ఫ్రేమ్ కేటాయించారు. కన్నప్ప సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు అని చెప్పేందుకే ఈ రెండో టీజర్ రిలీజ్ చేసినట్లుంది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్, ఇతర సపోర్టింగ్ రోల్స్ లో మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు..ఇలా చాలామంది స్టార్ కాస్టింగ్ ఉన్నారు.

తమ గూడెంపైకి దాడి చేసేందుకు వచ్చిన వారిని వీరోచితంగా ఎదుర్కొంటాడు తిన్నడు (మంచు విష్ణు). వేలల్లో కాదు లక్షల్లో రానీయండి అంటూ గూడెం వారికి ధైర్యం చెబుతాడు. దేవుడి మీద నమ్మకం లేని తిన్నడు శివుడి దయ ఎలా పొందాడు అనేది కన్నప్ప టీజర్ 2లో ఆసక్తి కలిగిస్తోంది. చివరలో రుద్రగా ప్రభాస్ ఎంట్రీ టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది. ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్ కానుంది.