ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ ట్రైలర్ కోసం సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. వారి వెయిటింగ్ కు చెక్ పెడుతూ ట్రైలర్ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సలార్ ట్రైలర్ ను సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అంటే సినిమా రిలీజ్ కు మూడు వారాల ముందుగా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్స్ లో ఇంటర్వెల్ లో సలార్ ట్రైలర్ ప్రదర్శిస్తారట. జవాన్ సినిమాకు సలార్ ట్రైలర్ అటాచ్ చేయడం మరింత క్రేజ్ పెంచుతోంది. సలార్ ను హోంబలే ఫిలింస్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సలార్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.