పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ హిట్ మూవీ సలార్ రీ రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డే 1 భారీ వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.24 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది. రీ రిలీజ్ లో డే 1 ఇంత భారీగా కలెక్షన్స్ రావడం ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ ను చూపిస్తోంది.
సలార్ పార్ట్ 1 శౌర్యంగపర్వ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేటర్స్ లో 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఓటీటీలో ఏడాది పాటు టాప్ లో ట్రెండ్ అయి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రీ రిలీజ్ లోనూ సత్తా చాటుతోంది.