ప్రాజెక్ట్ కే కోసం అమెరికాలో ప్రభాస్, రానా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో దిశా పటానీ నటిస్తుంది. బిగ్ బి అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే.. జూలై 20న జరిగే శాన్ డియాగో కామిక్ – కాన్‌లో టైటిల్ మరియు గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే.. ఈ కామిక్ ఈవెంట్ లో పాల్గొంటున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్ కే చరిత్ర సృష్టించింది. ఇలా ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. చరిత్ర సృష్టించడం స్టార్ట్ చేసింది. ఈ ఈవెంట్ కోసం ప్రభాస్, రానా అమెరికాలో అడుగుపెట్టారు. ప్రభాస్, రానా అమెరికాలో ఉన్న ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ ఈవెంట్ కు రానా వెళ్లడం ఆసక్తిగా మారింది. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. అయితే.. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడనుందని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 20న జరిగే కామిక్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. అప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని సమాచారం.