రెబెల్ స్టార్ ప్రభాస్ మంచి వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను డార్లింగ్ అని పిలుస్తుంటారు. స్నేహానికి ప్రభాస్ ఎంతో విలువ ఇస్తారు. ఈ విషయాన్ని తాజాగా మరో ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తోంది. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఇదొక కీ రోల్.
పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న ప్రభాస్ ఓ చిత్రంలో ్తిథి పాత్రలో నటించినా కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ప్రభాస్ కన్నప్ప కోసం రూపాయి కూడా తీసుకోకుండా నటించారట. డబ్బు కంటే స్నేహానికి ప్రభాస్ ఇచ్చే విలువ ఎలాంటిది అనేది ఈ సందర్భంతో తెలుస్తోంది. మంచు విష్ణు కన్నప్ప ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్ని చెబుతూ ప్రభాస్ వల్ల తనకు స్నేహంమీద నమ్మకం మరింతగా పెరిగిందని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మంచు విష్ణు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ప్రభాస్ మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది.