ప్రభాస్ ఇలాంటివి పట్టించుకోరు – సుధీర్ బాబు

తనపై వచ్చే ఛీప్ విమర్శలను ప్రభాస్(Prabhas) పట్టించుకోరని, అతనికి బ్రాడ్ మైండ్ ఉందని అన్నారు హీరో సుధీర్ బాబు(Sudheer babu). ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ(Arshad warsee) ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలను సుధీర్ బాబు ఖండించారు. ఏదైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ఎవరూ ఏమీ అనుకోరని, ఇలా చులకనగా మాట్లాడటం సరికాదని సుధీర్ బాబు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అర్షద్ వార్సీ లాంటి నటుడి దగ్గర నుంచి ఇలాంటి కామెంట్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదని సుధీర్ బాబు పేర్కొన్నారు.

కల్కి(Kalki 2898AD) సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitab bachan) ముందు ప్రభాస్ తేలిపోయారని, ప్రభాస్ ను స్క్రీన్ మీద చూస్తుంటే బాధగా అనిపించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అర్షద్ వార్సీ. దీనిపై టాలీవుడ్ నుంచి పలువురు కౌంటర్ గా అర్షద్ వార్సీ వ్యాఖ్యలను తప్పుపడుతూ పోస్ట్ లు చేస్తున్నారు.