డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ కాంపెయిన్ లో భాగమయ్యేందుకు ముందుకొచ్చారు రెబెల్ స్టార్ ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ కార్యక్రమంలో పాల్గొని తన మెసేజ్ అందించారు ప్రభాస్. ఈ రోజు తన మెసేజ్ తో కూడిన వీడియోను ప్రభాస్ రిలీజ్ చేశారు. ప్రభాస్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ప్రభాస్ స్పందిస్తూ – లైఫ్ లో మనకు బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనషులు, మన కోసం బతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్ ను ఈ రోజు నుంచే వదిలేయండి. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్ కు బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అని చెప్పారు.