హాలీడే మూడ్ లో ప్రభాస్

హెక్టిక్ షెడ్యూల్స్ లో కల్కి (Kalki 2898AD)తో పాటు తన ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ కు వర్క్ చేసిన ప్రభాస్ (Prabhas) కొద్ది రోజుల విరామం కోసం యూరప్ కు పయణమయ్యారు. ఆయన రెండు వారాల పాటు యూరప్ లో రిలాక్స్ కానున్నారు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ సహా తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన ప్రభాస్ హాలీడే వెళ్తున్నారు. ప్రభాస్ అందుబాటులో లేనందున ఇక తెలుగు రాష్ట్రాల్లో కల్కి బిగ్ ఈవెంట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

రాధేశ్యామ్ (Radhe shyam) సినిమా యూరప్ లో ఎక్కువ షూటింగ్ జరుపుకుంది. ఆ టైమ్ నుంచి ప్రభాస్ తరుచూ యూరప్ వెళ్తున్నారు. ఆ మధ్య కాలికి చికిత్స కూడా లండన్ లో తీసుకున్నారు. అక్కడ ప్రభాస్ సొంతంగా పెద్ద భవంతి కొనుగోలు చేశారనే వార్తలూ వచ్చాయి. ఏమైనా మళ్లీ రెండు వారాల తర్వాతనే ప్రభాస్ ఇండియాకు తిరిగిరానున్నారు. వచ్చాక ఆయనకు రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్ వంటి ప్రాజెక్ట్స్ ఎదురుచూస్తున్నాయి.