“కన్నప్ప” ప్రమోషన్స్ – ప్రభాస్ కు వీలవుతుందా ?

కన్నప్ప చిత్రాన్ని కృష్ణంరాజు చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. అయితే.. మంచు విష్ణు కూడా ఎప్పటి నుంచో కన్నప్ప చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే విష్ణు కన్నప్ప చిత్రాన్ని చేస్తున్నారు. విష్ణు కెరీర్ నే డిసైడ్ చేసే సినిమా ఇది. ప్రభాస్ ఇందులో గెస్ట్ రోల్ చేయడం వలన క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ క్రేజ్ వలన ఈ సినిమాకి ప్లస్ అవుతుందని.. ప్రమోషన్స్ ను కూడా ప్రభాస్ తో చేయించాలనేది విష్ణు ప్లాన్. అయితే.. ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు.

ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. హైద‌రాబాద్, తిరుప‌తి.. ఈ రెండు చోట్లా భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండింటిలో ఒక‌దానికి ప్ర‌భాస్ ని తీసుకురావాలి అనుకుంటున్నాడు విష్ణు. ప్ర‌భాస్ వ‌స్తే.. త‌ప్ప‌కుండా ఈ ప్రాజెక్ట్ గురించి జనం మరింతగా మాట్లాడుకొంటారు. అయితే ఈవెంట్ల‌కు రావ‌డం విష‌యంలో ప్ర‌భాస్ ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ప్రభాస్ గెస్ట్ రోల్ చేసి విష్ణుకు పెద్ద ఉపకారమే చేశాడు. అయితే తనకున్న భారీ పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ కు ప్రమోషన్స్ కు వచ్చేంత టైమ్ ఉండకపోవచ్చు.