పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే.. ఇటీవల ప్రభాస్, హను రాఘవపూడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హను ప్రభాస్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ కోసం హను అదిరిపోయే లవ్ స్టోరీ రెడీ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. హను ఇప్పటి వరకు ఎక్కువుగా లవ్ స్టోరీసే చేయడం వలన ప్రభాస్ తో చేసేది లవ్ స్టోరీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే.. ప్రభాస్ తో హను చేసేది లవ్ స్టోరీ కాదట.. యాక్షన్ స్టోరీ అని తెలిసింది.
అవును.. ఇది నిజంగా నిజం. ప్రభాస్ తో హను రాఘవపూడి డిఫరెంట్ యాక్షన్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. హనుకి ఇది సరికొత్త జోనర్. ప్రభాస్ ఇది వరకు యాక్షన్ డ్రామాలు చాలా చేశాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. అయితే వాటికీ, ఈ కథకూ ఏమాత్రం సంబంధం లేకుండా కొత్తగా డిజైన్ చేశాడని టాక్. బడ్జెట్ పరంగా కూడా భారీగానే డిజైన్ చేశాడట. ఇప్పుడు ప్రభాస్ చేతిలో సలార్, సలార్ 2, మారుతితో మూవీ, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. అందుచేత హనుతో సినిమా సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది.