పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు డీలక్స్ రాజా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో ఇద్దరు నాయికలూ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.
ఈ చిత్రంతో హారర్ ఎంటర్ టైనర్ కథలో తొలిసారి ప్రభాస్ నటిస్తున్నారు. సరదాగా నవ్వించేలా ఉంటూ రొమాంటిక్ గా ఈ మూవీ ఉండనుందట. ఇవాళ మొదలైన తాజా షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు ముఖ్య నటీనటులు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో కలర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని సమాచారం.
మరోవైపు ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ ప్రీ రిలీజ్ సెన్సేషన్ కొనసాగుతూనే ఉంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హాఫ్ మిలియన్ ప్రీ టికెట్ బుకింగ్ సేల్స్ జరుపుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.