పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీ రిలీజైంది. రేపు ప్రభాస్ గ్రాండ్ సెలబ్రేషన్స్ కు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. కామన్ డీపీతో సోషల్ మీడియాలో ప్రభాస్ కు బర్త్ డే విశెస్ చెప్పబోతున్నారు. ఈ సాయంత్రం నుంచే ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీ ట్రెండింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది.
సలార్ స్టిల్ తో డిజైన్ చేసిన ఈ కామన్ డీపీలో ప్రభాస్ నోటెడ్ ఫిలింస్ ఉన్నాయి. ఈశ్వర్, వర్షం, బాహుబలి సినిమాలతో పాటు రాబోయే స్పిరిట్ వంటి మూవీస్ పోస్టర్స్ ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీలో ఉన్నాయి. ఇక రేపు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి 4కే లో రీ రిలీజ్ అవుతోంది. దీంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి కనిపించనుంది. ఛత్రపతి ప్రభాస్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీగా నిలిచింది.