పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడో థియటర్స్ లోకి రావాలి కానీ.. ఇంత వరకు రాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. అయితే.. ఊహించని విధంగా ఈ మూడు సినిమాల గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ త్ర్రీ క్రేజీ మూవీస్ అప్ డేట్ ఇవ్వడమే కాకుండా.. అసలు విషయం కూడా బయటపెట్టారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న మూవీ ఓజీ. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు. ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటుంటే.. అభిమానులు అరుస్తున్నట్టు లేదు.. నన్ను బెదిరిస్తున్నట్టుగా ఉందన్నారు. ఓజీ కథ గురించి చెబుతూ 1980 – 90 బొంబాయి బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది..ఓజీ అంటే ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు కానీ.. ఓజాస్ గంభీర్ అని అర్థమని చెప్పారు. తనతో సంబంధం లేని వర్క్ ను కంప్లీట్ చేయమని డైరెక్టర్ సుజిత్ కు చెప్పానన్నారు పవర్ స్టార్.
పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చేస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాకి ముందుగా దర్శకుడు క్రిష్. అయితే.. ఎంతకు ఈ సినిమా కంప్లీట్ కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి పవన్ చెబుతూ.. ఈ సినిమాకి సంబంధించి ఎనిమిది తొమ్మిది రోజుల వర్క్ ఉందని.. ప్రస్తుతం ప్రీ విజువలైజేషన్ వర్క్ నడుస్తోందని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే.. టైమ్ ఇచ్చానని కానీ ఆ టైమ్ కు స్క్రిప్ట్ రెడీ చేయలేదని అందవలనే లేట్ అయ్యిందని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే కాదు.. మూడు సినిమాలు ఆలస్యానికి కారణం తను కాదని.. వాళ్లకు ఇచ్చిన టైమ్ కు రెడీ కాకపోవడం వలనే ఆలస్యం అయ్యిందన్నారు. ఈ విధంగా పవర్ స్టార్ మూడు సినిమాల ఆలస్యం వెనకున్న అసలు బయటపెట్టారు.