పవన్ లేకుండానే మొదలైన ‘హరి హర వీర మల్లు’ షూటింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీర మల్లు’ (Hari Hara veeramallu). ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi agarwal), నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ పొలిటికల్ బిజీ వల్ల ఈ సినిమా షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. షూటింగ్ తిరిగి మొదలుకాకపోవడంతో దర్శకుడు క్రిష్(Krish) ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయారు. ఆ బాధ్యతలు జ్యోతి కృష్ణ(jyothi krishna) తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ‘హరి హర వీర మల్లు’ మళ్లీ షూటింగ్ ప్రారంభించుకుంది.

అయితే ఈ షూటింగ్ లో పవన్ పాల్గొనడం లేదు. రెండు రోజుల కిందట ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేశారు. జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్స్ తో భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు. స్టంట్ సిల్వ యాక్షన్ కొరియోగ్రఫీలో సుమారు 500 మందితో ఈ భారీ వార్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. హరి హర వీరమల్లు పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.