పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో శ్రేయా రెడ్డి కీలక పాత్ర పోషిస్తుంది. చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారు. సుజిత్ ప్రస్తుతం పవన్ లేని సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ డిఫరెంట్ గా ఉండడంతో ఓజీ అప్ డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
తాజా అప్ డేట్ ఏంటంటే.. ఆగష్టు నుంచి ఓజీ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఈ కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో సినిమా దాదాపు పూర్తవుతుందట. ఆతర్వాత ప్యాచ్ వర్క్ ను సెప్టెంబర్, అక్టోబర్ లో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది టార్గెట్. అందుకనే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీ పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి.. ఓజీ అభిమానులు ఆశించే బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో చూడాలి.