హీరో నితిన్ తో మూవీ చేస్తున్న పవర్ స్టార్ డైరెక్టర్ అనగానే.. ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అనుకుంటున్నారా..? వకీల్ సాబ్ డైరెక్టర్. అదేనండి వేణు శ్రీరామ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ మూవీని తెరకెక్కించాడు. దిల్ రాజు బ్యానర్ లో వకీల్ సాబ్ మూవీ రూపొందింది. దిల్ రాజుకు బాగానే లాభాలు తీసుకువచ్చింది. అయితే.. ఇంత సక్సెస్ అందించినప్పటికీ ఇప్పటి వరకు వేణు శ్రీరామ్ నెక్ట్స్ మూవీని ప్రకటించలేదు. కొన్ని ప్రాజెక్టులు అనుకున్నాడు కానీ.. వర్కవుట్ కాలేదు. దీంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చినప్పటికీ ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నాడు.
అయితే.. ఇటీవల వేణు శ్రీరామ్ నితిన్ కి ఓ కథ చెప్పాడట. ఈ కథకు నితిన్ ఓకే చెప్పాడని తెలిసింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారని తెలిసింది. అయితే.. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ ట్రా అనే సినిమా చేస్తున్నాడు. దీనికి ఆర్డినరీ అనేది ట్యాగ్ లైన్. అలాగే వెంకీ కుడుముల డైరెక్షన్ లో కూడా సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత వేణు శ్రీరామ్ తో నితిన్ మూవీ సెట్స్ పైకి రానుందని సమాచారం.