కెరీర్ లో మళ్లీ బిజీ అయ్యేందుకు పూజా హెగ్డే ప్రత్యేక పూజలు చేస్తోంది. రీసెంట్ గా కాళహస్తి వెళ్లి ఆమె ప్రత్యేక పూజలు చేయడం విశేషం. ఒకప్పుడు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్.. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఈ మధ్య సినిమాలు తగ్గిపోయి పూజా జోరు నెమ్మదించింది. ప్రస్తుతం సూర్యతో కలిసి రెట్రో మూవీలో నటిస్తోంది పూజా హెగ్డే.
రెట్రో సినిమా మే 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. లారెన్స్ కాంచన 4లో హీరోయిన్ గా, రజినీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటు ఓ బాలీవుడ్ మూవీలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటుంది. ఇందుకోసం తన జాతకంలో దోషం పోవడం కోసం.. శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలు చేసింది. ఆ తర్వాత తిరుమల వెళ్లి దర్శనం చేసుకుంది. ఈ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పూజలు పనిచేస్తే పూజా మరింత బిజీగా మారనుంది.