పూజా అవుట్.. మీనాక్షి ఇన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబినేషన్లో గుంటూరు కారం అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల హీరోయిన్స్. అయితే.. షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో పూజా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో పూజా కోసం అనుకున్న పాత్రను ఎవరితో చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఫైనల్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇంతకీ మీనాక్షి చౌదరి ఎవరంటే.. సుశాంత్ కు జంటగా ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత హిట్ 2 సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించింది. రవితేజ కిలాడీ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మహేష్ బాబు సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ మీనాక్షి దక్కింది. మహేష్‌ బాబు సినిమా.. అది కూడా త్రివిక్రమ్ డైరెక్టర్.. ఇక మీనాక్షి దశ తిరిగినట్టే.