రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది. దీనిపై గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రోజు మేకర్స్ అఫీషియల్ గా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ను అనౌన్స్ చేశారు. పాట సెట్ లో పూజా హెగ్డే స్టిల్ ను రివీల్ చేశారు. పలు తమిళ చిత్రాలతో పూజా హెగ్డే అక్కడి ప్రేక్షకులకు పరిచయమే.
బీస్ట్ లో ఆమె చేసిన హబీబో పాట బాగా పాపులర్ అయ్యింది. కూలీ సినిమాలో పూజా హెగ్డే సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ బంగారం స్మగ్లర్ గా కనిపించనున్నారు. నాగార్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.