జానీ మాస్టర్ కు నోటీసులు ఇవ్వనున్న పోలీసులు

లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jonny master) కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రేపు జానీ మాస్టర్ కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. జానీ మాస్టర్ ను విచారించిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బాధితురాలి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు.

ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలు చెప్పిన వివరాలను బట్టి ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. మతం మార్చుకోమని బలవంతపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ తెలిపింది. బాధితురాలిని పోలీసులు భరోసా కేంద్రానికి పంపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసును చిత్ర పరిశ్రమ తీవ్రంగా పరిగణిస్తోంది.