జానీ మాస్టర్‌పై పోక్సో కేసు

మహిళా డ్యాన్సర్ పై అత్యాచారం చేశాడనే అభియోగాలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny master) పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్ గా ఉన్న బాధితురాలపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని, అందుకే పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. నార్త్ ఇండియాకు జానీ మాస్టర్ పారిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. జానీ మాస్టర్ ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.